‘ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షోని నిర్వహిస్తోంది. ఈ విషయా న్ని మంగళవారం హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, సీఈవో రాజేంద్రకుమార్, ఎన్టీఆర్ ట్రస్ట్ సీవోవో గోపి వెల్లడించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ‘నందమూరి తారక రామారావు చాలా కష్టపడి పైకి వచ్చిన మహోన్నత వ్యక్తి.
ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజలకు విద్య, వైద్య, ఆరోగ్యం అందుబాటులో ఉండాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌ను స్థాపించారు. 28 ఏళ్లుగా ఈ సంస్థ ప్రయాణం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మాకు ముందు గుర్తుకు వచ్చింది ఎన్ తమన్.
మా టీమ్ ఆయన్ని కలిసిన వెంటనే ఆయన ఒప్పుకున్నారు. ఈ మ్యూజికల్ నైట్ షోలో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నాం’ అని తెలిపారు. తమన్ మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ పేరిట స్థాపించిన ట్రస్ట్ ఎంత గొప్పదో మనం చుస్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్‌కు ఫిబ్రవరి 15న మా మ్యూజికల్ కాన్సర్ట్ చేయడం గౌరవంగా భావిస్తున్నాం. ఈ షోలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు.