* అవినీతికి పాల్పడినపాలకవర్గ సభ్యులు
* సహకరించిన ఆరుగురు అధికారుల సస్పెన్షన్
కామారెడ్డి, జనవరి 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కోటగిరి మండలం ఎత్తోడ సహకార సంఘం పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఆరుగురు అధికారులను స చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎత్తోడ సహకార సంఘంలో అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు.
అవినీతి జరగిందని తేలడంతోపాటు సంబంధిత కా రికార్డులను నిర్వహణ సరిగా చేయలేదని తేల్చారు. దీంతో సహకార సం కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కార్యవర్గంతో పా వారితో చేతులు కలిపి అవినీతికి పాల్పడిన ఆరుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ ఘటనతో సహకార సంఘాల్లో అవినీతికి పాల్పడ్డ పాలకవర్గం, అధికారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. అంతేకాకుండా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్, దోమకొండ, మాచారెడ్డితో పాటు పలు ప్రాథమిక సహకార సం పాలకవర్గ సభ్యులు, అధికారులు అక్రమాలకు పాల్పడ్డరన్న ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.