calender_icon.png 29 November, 2024 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇథనాల్‌కు నిబంధనలు బేఖాతర్

29-11-2024 02:57:09 AM

గత బీఆర్‌ఎస్ మంత్రివర్గ ఆమోదంతోనే పరిశ్రమ ఏర్పాటు

ఫ్యూయల్ ఇథనాల్ సాకుతో ప్రజాభిప్రాయానికీ మినహాయింపు

పంచాయతీ అనుమతి లేకుండానే కాంపౌండ్ వాల్ నిర్మాణం


హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథ నాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చే విషయం లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. పక్కా ఆధారాలతో బీఆర్‌ఎస్ చేసి న తప్పిదాలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతిని ఉల్లఘించి నిబంధనలను తుంగలో తొక్కి ప్రజలకు చేసిన మోసాన్ని బట్టబయలుచేసిం ది. కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్‌కు అనుమతిస్తే దానిని పట్టించుకోకుండా ఇథనాల్, ఎక్స్‌ట్రా న్యూటల్ ఆల్కహాల్, ఇండస్ట్రి యల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ వంటి ఉత్పత్తులకు అప్పటి మంత్రివర్గం అనుమతి ఇచ్చింది.

ఫ్యూయల్ ఇథనాల్ సాకు చూపిం చి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఈ కంపెనీ అడ్డదారులు అనుసరించిందని, అప్పటి ప్రభుత్వం కంపెనీకి అనుకూలంగా మంత్రివర్గంలోనే అడ్డగోలు అనుమతులు జారీచేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంచేసింది. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం స్థానిక సంస్థల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవటం తప్పనిసరి. కానీ, పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోకుండానే కాంపౌండ్ వాల్ నిర్మించింది. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అండతోనే ఈ కంపెనీ పర్యావరణ అనుమతుల నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘించిందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. 

పర్యావరణ అనుమతుల ఉల్లంఘన

ఇథనాల్ తయారీకి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఇథనాల్/ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్/ ఇండస్ట్రీయల్ స్పిరిట్స్/అబ్జ ల్యూట్ ఆల్కహాల్ తయారీకి పీఎంకే డిస్టిలేషన్స్ ప్రై.లి. కంపెనీ లెటర్ ఆఫ్ ఇండెంట్ తీసుకుంది. కానీ, కేంద్ర పర్యావరణ శాఖకు ‘ఫ్యూయల్ ఇథనాల్’ కోసమే దరఖాస్తు చేసింది. అక్కడ ప్రతిపాదించిన 300 కేఎల్‌పీడీ సామర్థ్యం మొత్తం ‘ఫ్యూయల్ ఇథనాల్’ తయారీకేనని కంపెనీ స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించిం ది. పర్యావరణ అనుమతి తీసుకోకుండానే నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ కంపెనీ కాంపౌండ్ వాల్ నిర్మించింది. 

లెటర్ ఆఫ్ ఇండెంట్ 

22 600 లక్షల లీటర్ల ఇథనాల్/ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్/ ఇండ స్ట్రీయల్ స్పిరిట్స్/అబ్జల్యూట్ ఆల్కహాల్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసింది. అప్పటి ప్రభుత్వం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం లేకుండానే అత్యవసరం పేరిట ఆదేశాలు జారీ చేసింది. 2022 డిసెంబర్‌లో క్యాబినెట్‌లో ఈ నిర్ణయాన్ని ర్యాటిఫై చేసింది. 24 కేంద్ర పర్యావరణ శాఖ ‘ఫ్యూయల్ ఇథనాల్’ ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇచ్చిన ప్పటికీ అప్పటి ప్రభుత్వం 01 ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్‌లో ఫ్యూయల్ ఇథనాల్‌కు పరిమితం కాలేదు. మిగతా ఉత్పత్తు లన్నీ జోడించిన్ లెటర్ ఆఫ్ ఇండెంట్ మరోసారి జారీ చేసింది. 

ప్రజాభిప్రాయ సేకరణకు మినహాయింపు 

కంపెనీ సమర్పించిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఈ ఫ్యాక్టరీ బీ2 క్యాటగిరీకి వస్తుందని, ప్రజాభిప్రాయ సేకరణ నుంచ మినహాయించారు. దీంతోపాటు కేంద్రం పర్యావరణ శాఖ కేవలం ‘ ఫ్యూయల్ ఇథనాల్’ ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ పీవోకే కంపెనీ దానికి పరిమితం కాకుండా, కొత్త లెటర్ ఆఫ్ ఇండెంట్‌ను చూపించి 07 ఇథనాల్/ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్/ ఇండస్ట్రీయల్ స్పిరిట్స్/అబ్జల్యూట్ ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుంది. 

నీటి అనుమతి, టీఎస్ ద్వారా అనుమతులు 

ప్రభుత్వం ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్ ఆధారంగా 15 ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఆదిలాబాద్ చీఫ్ ఇంజినీర్ విభాగం నీటి కేటాయింపులకు అనుమతి ఇచ్చింది. 07 ముందే టీఎస్‌ఐపాస్ ఈ కంపెనీకి అనుమతులు జారీ చేసింది.