calender_icon.png 19 September, 2024 | 9:44 PM

పచ్చని పల్లెకు ఇథనాల్ మంట!

19-09-2024 01:46:55 AM

ఫ్యాక్టరీ వద్దంటూ ఏడాది కాలంగా రైతుల ఆందోళన 

సీఎం పేషీలో ఫిర్యాదు చేసినా ఆగని పనులు

కలెక్టర్ హామీ ఇచ్చినా.. దక్కని న్యాయం 

స్థానిక ఎన్నికల బహిష్కరణ దిశగా ఆరు గ్రామాల రైతుల నిర్ణయం

నిర్మల్ , సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): పచ్చని పంటపోలాలు.. ఏడాదికి రెండు పం టలు.. పక్కనే గోదారమ్మ.. ప్రకృతి ప్రసాదించిన జీవనం.. పక్షుల రాగాలు, అడవి జం తువుల స్థావరాలు.. ఇది నిర్మల్ జిల్లా దిలువార్‌పూర్ పరిసర ప్రాంతాల దృశ్యం. దీన్ని విధ్వంసం చేస్తే తమ బతుకులు ఆగమైపోతాయని, భూమిని నమ్ముకొని బతికే తమకు.. ఆ భూమిని కలుషితం చేసే ఇథనాల్ పరిశ్ర మ పచ్చని పంట పొలాల మధ్య ఏర్పాటు చేస్తె చావే గతి అని రైతులు ఉద్యమ బాట పట్టారు.

ప్రజల ప్రాణాలు ముఖ్యమా? ప్రా ణాలు తీసే పరిశ్రమ ముఖ్యమా? అని ఏడా ది కాలంగా బతుకు పోరాటం చేస్తున్నారు. దిలువార్‌పూర్ వద్ద నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను ఆపేయాలని ఆరు గ్రామాల ప్రజలు కొట్లాడుతున్నా.. ఫ్యాక్టరీ పనులు నిరాటంకంగా జరగడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిలువార్‌పూర్ నుంచి గుండంపల్లికి వెళ్లే దారిలో రెండు గ్రామాలకు మధ్యన 20 ఎకరాల్లో ఓ ప్రైవేట్ కంపెనీ ఇథనాల్ పరిశ్రమను నిర్మిస్తుంది. పంట పొలాల మధ్య గ్రామాలకు సమీపంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తే జీవవైవిద్యం దెబ్బతిని పాడి, పంట పొలాలకు నష్టం ఏర్పడి జీవరాసులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన చేస్తున్నారు.

దిలువార్ పూర్ లోలం, బన్సపల్లి, లోలం తండా, టెం బుర్ని, కాండ్లీ, గుండంపల్లి తదితర గ్రామాల ప్రజలకు ఇథనాల్ ప్యాక్టరీ వల్ల నష్టం కలుగుతుందని 10 వేల మంది రైతులు అభ్యం తరం వ్యక్తం చేస్తూ జేఏసీలుగా ఏర్పడి ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నా.. అధికా రులు, పాలకులు పట్టించుకోవడం లేదని ఆ రోపిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్‌కు చె ందిన ఒక ప్రజాప్రతినిధిది కావడంతో అధికారులు ఆతనికి వత్తాసు పలుకడంతోనే పనులు జోరుగా సాగుతున్నట్టు రైతులు చెప్తున్నారు.

ఎన్నికల బహిష్కరణ గ్రామాలు 

దిలువార్‌పూర్ ఫ్యాక్టరీ పనులు నిలుపుదల చేస్తామని అధికారులు హమీ ఇచ్చినా.. పనులు ఆగడం లేదు. ఫ్యాక్టరీ వద్ద బౌన్సర్ల ను, 20 మందితో ప్రైవేట్ రక్షణ దళం ఏర్పాటుచేసుకొని పనులు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏడాదిగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 3 నెలల క్రితం వెయ్యి మంది రైతులు 3 గంటలు కలెక్టర్ కార్యలయాన్ని దిగ్బంధించారు. దీంతో కలెక్టర్ అభిలాష అభినవ్ రైతుల వద్దకు వచ్చి పనులు నిలిపివేయిస్తామని, చర్చల ద్వారా రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

నెల  రోజులుగా  దిలువార్‌పూర్, గుండంపల్లిలో రైతులు రిలే నిరహార దీక్షలు ప్రారంభించారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాక పోవడంతో వారం రోజుల క్రితం హైదారాబాదు వెళ్ళి ప్రజాభవనన్‌లో ఫిర్యాదు చేశారు. సీఎం పేషీకి ఉత్తరాలు రాశారు. తమకు న్యాయం జరుగకుంటే త్వరలో జరిగే సర్పంచ్, ఎంపిటీసీ, జడ్పీటీసి ఎన్నికలను బహిష్కరిం చడానికి ఆరు గ్రామాల రై తులు కార్యచరణ రూపొందించుకొంటున్న ట్టు తెలిసింది.  

ఫ్యాక్టరీ వల్ల అనర్థాలే ఎక్కువ  

దిలువార్‌పూర్ వద్ద నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు కంటే కీడు ఎక్కువగా ఉంటుందని రైతులు, పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. పరిశ్రమ నెలకొల్పడానికి మొద ట ప్రభుత్వం ద్వారా పర్యావరణానికి సం బంధించిన అన్ని అనుమతులు తీసుకోవాలి. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, భూముల పర్యవరణ సమతుల్యం, జీవరాసుల స్థితిగతులు, ప్రజాభిప్రాయం, భౌగోళిక పరిస్థితులు పరిశీలన చేసిన త రువాతనే ఫ్యాక్టరీ నిర్మాణం పనులకు అ నుమతి ఇవ్వాల్సి ఉంటుంది. పత్రికల్లో బహిరంగ పేపర్ నోటిఫికేషన్ ద్వారా చే యాలి. ఈ ప్రమాణాలు పాటించలేదని రైతులు పేర్కొంటున్నారు.

ఫ్యాక్టరీలో వె లువడే రసాయనాలు పంటపొలాలపై ప్రభావం చూపడంతో ఏడాదికి రెండు ప ంటలు పండే పంట భూములు దెబ్బ తి ంటాయని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గాలి, నీటిలో రసాయనాలు వ్యా పించి ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులు, దీర్ఘకాలిక రోగాలు వస్తాయని వాపోతున్నారు. రసాయనాలు గో దావరి నదిలో కలిస్తే 13 లక్షల ఎకరాల సాగుపై ప్రభావం ఉంటుందని ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం రసాయనాలు భూమిలో ఇంకే విధంగా పెద్ద గుంత ఏర్పాటు చేస్తున్నారు.

ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేయాలని 2023 నుంచి కొట్లాడుతున్నా అధికారులు పటించుకోక పోవడంపై మండిపడుతున్నారు. రైతులకు మద్దతుగా ప్రారంభంలో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ఉద్యమ సం ఘాలు జన సమితి పాల్గొన్నా.. తరువాత రైతులకు మద్దతు ఇవ్వకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఫ్యాక్టరీ పనులు అడ్డుకోవడంతోపాటు సామగ్రిని దహనం చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫ్యాక్టరీ యాజమన్యం ఫిర్యాదుతో పోలీసులు 20 మంది రైతులపై కేసులు పెట్టారు. 

శాంతియుతంగా ఆందోళన చేస్తే కేసులు  పెట్టారు

మా పంట పొలాల మధ్య చేస్తున్న ఫ్యాక్టరీ పనులను ఆపమని శాం తియుతంగా ఆందోళన చేస్తే.. మాకు న్యాయ ం చేయాల్సిన అ ధికారులు మాపైనే కే సులు పెట్టి వేధిస్తున్నారు. ఫ్యాక్టరీ కారణంగా మా పం టపొలాలు దెబ్బతింటాయాని అధికారులకు తెలుపడం త ప్పా. ఏడాది కాల ంగా ఆందోళన చేస్తు న్నా మాకు ఎవ రూ న్యాయం చేస్తలేరు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ పట్టించు కోవట్లేదు. ఫ్యాక్టరీని వెంటనే ఆపేయా లి. మాపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలి.

 శేఖర్, రైతు, దిలువార్ పూర్, నిర్మల్

ఫ్యాక్టరీ పనులను ఆపాలి 

మాకు వ్యవసాయ మే బతుకు. మాకున్న మూడు ఎకరాల్లోనే ఏడాదికి రెండు పం టు పండించుకుంటున్నం. ఫ్యాక్టరీ కడితే వచ్చే రసాయనాల వల్ల పంట భూ మలు కరాబ్ అయితయని మాతో టి రైతులు అంటున్నరు. పంట లు పం డకపోతే మాకు బతుకు లేదు. ప్రజలకు రోగాలు కూడ వస్తాయట. ఫ్యాక్టరీ ప నులను అధికారులు బంద్ చెయ్యాలి.  

 రుక్కవ్వ, మహిళా రైతు, 

దిలువార్‌పూర్, నిర్మల్