calender_icon.png 4 November, 2024 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలి

15-08-2024 12:23:25 AM

  1. దిలువార్‌పూర్ రైతుల డిమాండ్, కలెక్టరేట్ ముట్టడి 
  2. 4 గంటలపాటు ఆందోళన.. దిగివచ్చిన అధికారులు 
  3. కలెక్టర్ హమీతో విరమణ

నిర్మల్, ఆగస్టు 14 (విజయక్రాంతి): తమ బతులకులను నాశనం చేసే ఇథనాల్ ఫ్యాక్ట రీ పనులను వెంటనే ఆపాలని కోరుతూ దిలువార్‌పూర్ రైతులు బుధవారం నిర్మల్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. దాదాపు 4 గంటలు దిగ్బంధం చేసి, నిరసన తెలిపారు. దిలువార్‌పూర్ మండల కేంద్రం వద్ద నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమతో వల్ల పంటపొ లాలు దెబ్బతినడమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి హాని జరుగుతుందని దాదాపు 500 మంది రైతులు కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదు ట బైఠాయించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ లోనికి ఎవ్వరిని పోనివ్వకుండా అడ్డు కున్నారు. తమకు న్యాయం జరిగితేనే ఇక్కడ నుంచి కదులుతామని తెలిపారు.

డీఎస్పీ గంగారెడ్డి అక్కడకు చేరుకుని నచ్చజెప్పినా వినలేదు. 13 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే కొందరు అధికారులు తమపై కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని వాపోయారు. పరిశ్రమతో తమ భవిష్యత్తు అంధకారం అయ్యే ప్రమాదమున్నా అధికారులు పరిశ్రమ యాజమాన్యానికే వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్వో భుజంగ్‌రావు వచ్చి.. కలెక్టర్‌తో సమస్యను వివరించేందుకు 10 మంది రైతులు రావాలని కోరగా.. కలెక్టరే తమ వద్దకు రావాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో కలెక్టరే వారి దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఆర్డీవో, అదనపు కలెక్టర్‌ను పంపి పనులు ఆపే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. రైతులకు, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమంచారు.