హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం సాధించారని అన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్, ఇతర బిజెపి నాయకులు సరూర్‌నగర్ స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హోదా, స్థాయి మరిచి రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి డీఎన్ఏ పరీక్ష జరగాలన్న వ్యాఖ్యలకు శిక్ష తప్పదన్నారు. కాంగ్రెస్ దుర్మార్గాలపై సభకు ముఖ్యఅతిథిగా జేపీ నడ్డా వస్తున్నారని ఈటల వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలపై బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఇంటింటికి వెళ్లి సమాచారం తెలుసుకుంటున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.