calender_icon.png 31 October, 2024 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2.80 లక్షల కోట్లతో అంచనాలు

25-07-2024 12:55:32 AM

కేంద్రం మొండి చెయ్యితో సొంత రాబడులే ఆధారం 

వ్యవసాయం, సంక్షేమానికి పెద్ద పీట

ఆరు గ్యారెంటీలకు ప్రాధాన్యం

నేడు అసెంబ్లీలో ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఫుల్ బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టను న్నారు. ఫిబ్రవరిలో రూ.2.75 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆయన.. ఇప్పుడు పూర్తిస్థాయి పద్దును ప్రతిపాదించబోతున్నారు. దాదాపు రూ.2.80 లక్షల కోట్లతో అంచనాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడంతో సొంత రాబడులపైనే ప్రజ లు ఆశలు పెట్టుకున్నారు.

వాస్తవానికి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చే నిధులను బట్టి రాష్ట్ర పద్దులో కేటాయింపులను చేయాలని తొలుత రేవంత్ సర్కారు భావించింది. అయితే నిర్మలా సీతారామన్ మొండిచెయ్యి చూపడంతో కేటాయింపులను సవరించి రాష్ట్రానికి అత్యవసరమైన విభాగాలకు సొం త రాబడుల నుంచే కేటాయింపులు చేసే అవకాశం ఉంది. జూలై 31తో ఫిబ్రవరిలో ప్రకటించిన ఓటాన్ అకౌంట్ గడువు ముగియనుంది.

ఆరు గ్యారెంటీలకు నిధులు పెంపు 

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యా రెంటీలకు నిధులను పెంచే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.53వేల కోట్లను కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు దాదాపు రూ.70వేల కోట్ల నుంచి రూ.75వేలకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, పంచాయతీరాజ్, వ్యవసాయం, ఇరిగేషన్, విద్యుత్ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించనున్నారు. 

వాస్తవికతకు దగ్గరగా..

ఈ బడ్జెట్‌ను వాస్తవికతకు దగ్గరగా ఉండే లా ఆర్థికశాఖ రూపొందించినట్లు సమాచా రం. పద్దు రూకకల్పనపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. అందువల్ల 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన పద్దు కంటే 2024 ఓటాన్ అంకౌట్ బడ్జెట్‌ను తగ్గించారు. 2023 బడ్జెట్ రూ.2,90,396కోట్లు కాగా 2024 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.2,75,891 కావడం గమనార్హం. ఫుల్ బడ్జెట్ కూడా గతేడాది కంటే తక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బడ్జెట్‌ను రూ.2.80లక్షల అంచనాలతో తయారు చేసినట్లు సమాచారం. 

సొంత రాబడులే దిక్కు 

కేంద్రం నుంచి ఆశించిన నిధులు రాలేదు. పైగా ఎఫ్‌ఆర్‌బీఎం సడలింపులు లేవు. కేంద్రం గ్రాంట్లపై స్పష్టత ఇవ్వలేదు. బకాయిలను చెల్లించడంలోనూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం సొంత రాబడుల ఆధారంగానే బడ్జెట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పన్ను, పన్నేతర ఆదాయాన్ని మరింత పెంచుకుంటామన్న ధీమాతో ఈ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. కేంద్ర నుంచి వచ్చే పన్ను వాటా ఈ సారి పెరగడం కాస్త ఊరటనిచ్చే విషయం.

ఈ సారి పన్ను వాటాలో తెలంగాణకు రూ.26,216.38 కోట్లను మంగళవారం ప్రకటించిన బడ్జెట్‌లో కేంద్రం చెప్పింది. ఇది గతేడాది కంటే రూ.3,150 కోట్లు అధికం. అయితే కేంద్ర నుంచి పన్ను వాటాను రాష్ట్రం ఎంత వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే గతేడాది ట్యాక్స్ రెవెన్యూ అంచనాలో కేవలం 88 శాతం రాబడిని మాత్ర మే ప్రభుత్వం సాధించింది. ఈ సారి 100 శాతం రాబడి సాధించే లక్ష్యంతో పక్కా ప్రణాళికతో బడ్జెట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.