calender_icon.png 12 February, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి దేవస్థానంలో వైభవోపేతంగా సహస్ర కలశ స్థాపన

11-02-2025 08:28:03 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో సహస్త్ర కలశ స్థాపన మహోత్సవం మంగళవారం వైభవోపేతంగా జరిగింది. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని జరిగే ఈ క్రతువుకు సోమవారం అర్చక స్వాములు అంకురార్పణ చేశారు. ఈ తరుణంలో మంగళవారం సహస్ర కలశస్థాపన, కలశ ఆవాహన, అగ్నిప్రతిష్టాపన, సాయంత్రం వాస్తు పూజ ఘనంగా జరిగాయి. ఈ తరుణంలో బుధవారం కలశాభిషేకంలో భాగంగా 1000 కలశాలతో స్వామి వారికి అభిషేకం, పూర్ణాహుతి, మహా నివేదిన నిర్వహించనున్నారు. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు రామచంద్రస్వామి వారి ఆరాధ్య దైవమైన రంగనాధుడి వార్షిక కళ్యాణం గుట్టపై గల శ్రీరామదాసు ధాన్య మందిరం వద్ద గల రంగనాధస్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా జరగనుంది.