నగర మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): నగగరంలో వరుస వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా జీహెచ్‌ఎంసీ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటి స్తూ చర్యలు తీసుకుంటున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్‌రూంను సోమవారం ఆమె ఆకస్మి కంగా సందర్శించారు. నగరంలో నమోదైన వర్షపాతం వివరాలు, కంట్రోల్ రూంకు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారాలను ఓఎస్డీ అను రాధను అడిగి తెలుసుకున్నారు.
శిథిలావస్థలో ఉన్న 596 భవనాలు గుర్తించామని మేయర్ తెలిపారు. వాటిలో 344 భవనాలపై చర్యలు తీసుకున్నామని, 129 భవనాలను ఖాళీచేయించామని, నాలుగు భవనాలకు సీల్ వేశామని పేర్కొన్నారు. నగరంలో ముందస్తుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్ల్లు చెప్పారు. సీసీపీ శ్రీనివాస్(యూబీడీ), అడిషనల్ కమిషనర్ సునంద, కంట్రోల్‌రూమ్ ఓఎస్‌డీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.