calender_icon.png 24 October, 2024 | 3:56 PM

59 పునరావాస కేంద్రాల ఏర్పాటు

02-09-2024 01:04:45 AM

కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) : రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మూసీనది పరివాహక ప్రాంతమైన జియాగూడలో ఆదివారం కలెక్టర్ పర్యటించి పరిస్థితని సమీక్షించారు. ప్రజల తో నేరుగా మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ ఫోన్ నంబర్లు 040 90634 23979కు ఫోన్‌చేస్తే వెంటనే సహాయక బృందాలను పంపిస్తామన్నారు.

ప్రజల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌పై సత్వరమే స్పందించాలని.. పోలీసు, రెవెన్యూ, విద్యుత్, మున్సిపల్, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీ, వైద్య శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మూసీ పరీవాహక ప్రాంతం తో పాటు లోతట్టు ప్రాంతా ల్లో నివసించే ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లో వచ్చే వరదను గేట్ల ద్వారా మూసీకి వదలడం జరుగుతుం ది కాబట్టి పరీవాహక ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించా లని చెప్పారు.

ఇందుకోసం ప్రత్యే కంగా 56 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లలు, పెద్దలు ఇండ్ల నుంచి బయటకి రాకుం డా అవగాహన కల్పించాలని, వర్షాల వలన పాఠశాలలు, గురుకులాల్లో అంటువ్యాధులు ప్రబలకుం డా వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఆర్డీవోలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, కంట్రోల్ రూమ్‌లలో అనుబంధ శాఖ ల అధికారుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు కదిరివన్, వెంకటాచారి, ఆర్డీవోలు జ్యోతి, దశరథ్‌సింగ్ తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు.