09-04-2025 01:46:00 AM
3 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంతో 240 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
సిరిసిల్ల, ఏప్రిల్- 8(విజయక్రాంతి): యాసంగి పంట కొనుగోలు లో భాగంగా మహిళా సంఘాల ద్వారా 191 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ముస్తాబాద్ మండలంలోని గూడెం, నామాపూర్, పోత్గల్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాల్లో అధికంగా మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించడం జరిగిందని అన్నారు సిరిసిల్ల జిల్లా పరిధిలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి గాను మహిళా సంఘాల ద్వారా 191 కొనుగోలు కేంద్రాలకు చర్యలు తీసుకుంటున్నామని,
వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 42, మెప్మా ద్వారా 6, డిసిఎంఎస్ ద్వారా 1 మొత్తం 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తలారి రాణి, డీఆర్డీఓ శేషాద్రి, పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, పౌర సరఫరాల మేనేజర్ రజిత, తహశీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
సిరిసిల్ల, ఏప్రిల్8 (విజయక్రాంతి): అధికారిక పర్యటన నిమిత్తం వెళ్తున్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన చూసి తన వాహనాన్ని ఆపారు. గాయపడిన యువకులను అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన స్థలంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నా యని, అవి నిరంతరం పని చేసేలా చూడాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.