11-04-2025 08:00:13 PM
రాజంపేట (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని శివాయిపల్లి, ఆరెపల్లి గ్రామాలలో శుక్రవారం ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ ఆఫీసర్ అపర్ణ, తాహాసిల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీడీవో రఘురాం, శివాయ పల్లి మాజీసర్పంచ్ విట్టల్ రెడ్డి, గ్రామాల రైతులు గ్రామ సంఘం అధ్యక్షులు లక్ష్మి, సొసైటీ డైరెక్టర్ గురువారెడ్డి, ఆరేపల్లిలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ దిలీప్ రావు సొసైటీ డైరెక్టర్ రామ్ సింగ్, మాజీ సర్పంచ్ యాదగిరి, గ్రామ కార్యదర్శిలు, గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు రామవ్వ, ఏపీఎం సాయిలు, సీసీలు శ్రీనివాస్, రమేష్, స్వామి విఓఏలు పాల్గొన్నారు.