- పోస్టర్‌ను ఆవిష్కరించిన పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
- గాంధీ భవన్లో కనెక్ట్ సెంటర్ ఏర్పాటు
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): ఇంటింటి సమ గ్ర కుటుంబ సర్వేపై కార్యకర్తలకు వస్తున్న సందేహాలను నివృత్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆదివారం మిస్డ్ కాల్ నంబర్ 72890 87272 ను ఏర్పాటు చేసింది. ఏమైనా సందేహాలు వస్తే ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. తిరిగి కాల్ చేసి నివృత్తి చేస్తామని పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిస్డ్ కాల్ నెంబర్ పోస్టర్‌ను మహేశ్‌కుమార్‌గౌడ్ ఆవిష్కరించారు.
గాంధీ భవన్లో కనెక్ట్ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. రోజుకు గాంధీ భవన్ వేదికగా 2 వేల మందికిపైగా సందేహాలను నివృత్తి చేసేలా పనిచేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. రానున్న 15 రోజుల్లో సుమారుగా 30 వేల కార్యకర్తలతో నేరుగా మాట్లాడేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో 15వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు సర్వేపై సందేహాలను నివృత్తి చేయడం కోసం పనిచేస్తున్నారని మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు.