24-04-2025 12:20:29 AM
డి ఆర్ డి ఓ జయదేవ్ ఆర్య
గజ్వేల్, ఏప్రిల్ 23 : అధిక పాల సేకరణే లక్ష్యంగా మండల సమాఖ్యల ఆధ్వర్యం లో పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డిఆర్డిఓ జయదేవ్ ఆర్య తెలిపారు. ములుగు మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాల శీతలీకరణ కేంద్రాన్ని బుధవారం బెంగళూరుకు చెందిన కృషి కల్ప ఫౌండేషన్ బృందం సభ్యులు పరిశీలించారు.
వారికి డిఆర్డిఓ జయదేవ్ ఆర్య సమాఖ్య ద్వారా నిర్వహిస్తున్న బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ నిర్వహణ, ,పాటిస్తున్న ప్రమాణాలు, పాల సేకరణ, శీతలీకరణ , మిల్క్ బిల్లింగ్,విజయ డెయిరీమరియు, మండల సమాఖ్య అందిస్తున్న సేవల గురిం చి వివరించారు.
అలాగే పాల ఉప ఉత్పత్తులు,లోకల్ సెల్ అమ్మకం,ఆన్లైన్ బిల్లింగ్ విధానాన్ని పరిశీలించాలని బృందం మండ ల సమాఖ్య కు సూచించారు. ఈ కార్యక్ర మం లో డిపిఎం వాసుదేవ్, ఏటీఎం యా దగిరి,సీసీ లు రాజలింగం, భాస్కర్, నర్సిం లు, ఉమ,మండల సమాఖ్య అధ్యక్ష్య కోశాధికారులు భాగ్య లక్ష్మి, సరస్వతి, BMCU సిబ్బంది మహేందర్,రజిత,ప్రకాష్ తదితర పాల్గొన్నారు.