calender_icon.png 30 October, 2024 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్బీనగర్‌లో ‘గృహజ్యోతి’ కేంద్రాల ఏర్పాటు

04-07-2024 01:47:29 AM

ఎల్బీనగర్, జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గృహజ్యోతి పథ కం లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కు అధికారులు ఏర్పాట్లు చేశారు. అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి ఆన్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్ హేమంత్‌కేశవ్ ఆదేశాలు జారీచేశారు.  ఈ మేరకు ఎల్బీనగర్, సరూర్‌నగర్, హయత్‌నగర్ సర్కిల్ పరిధిలో ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ కమిషనర్లు యాదయ్య, సుజాత, జకియా సుల్తానా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్లవారీగా ప్రజాపాలన సేవా కేంద్రాల వివరాలు..

నాగోల్: వార్డు ఆఫీస్, లలితానగర్ మోడల్ మార్కెట్ బిల్డింగ్, లలితానగర్

మన్సూరాబాద్: వార్డు ఆఫీసు, జడ్జెస్ కాలనీ

హయత్‌నగర్: వార్డు ఆఫీసు, హయత్‌నగర్ ఓల్డ్ విలేజ్

బీఎన్‌రెడ్డి: వార్డు ఆఫీసు, ఎన్జీఓ కాలనీ, వనస్థలిపురం

సరూర్‌నగర్: వార్డు ఆఫీసు సరూర్‌నగర్

కొత్తపేట: వార్డు ఆఫీసు, మహిళా భవన్, ఓల్డ్ విలేజ్ కొత్తపేట

చైతన్యపురి: వార్డు ఆఫీసు, భవానీ నగర్ కమ్యూనిటీ హాల్, రోడ్ నంబర్ 10

గడ్డిఅన్నారం: వార్డు ఆఫీసు , బస్తీదవాఖాన బిల్డింగ్, వీవీ నగర్

వనస్థలిపురం: వార్డు ఆఫీసు,  ఎఫ్‌సీఐ కాలనీ

హస్తినాపురం: వార్డు ఆఫీసు, నందనవనం

చంపాపేట: వార్డు ఆఫీసు, చంపాపేట

లింగోజిగూడ: వార్డు ఆఫీసు, లింగోజిగూడ