calender_icon.png 29 September, 2024 | 4:02 PM

ఇంఫాల్‌లో గోధ్వజ స్థాపన

28-09-2024 02:30:24 AM

గోవిందదేవ్ మహారాజ్ ఆలయంలో పూజలు నిర్వహించిన జ్మోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి 

మణిపూర్, సెప్టెంబర్ 27: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు శుక్రవారం గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర చేరుకుంది. జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిము క్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ గోప్రతిష్ఠ ధ్వజాన్ని స్థాపించారు. ఈ సందర్భంగా మణిపూర్‌లోని గోవిందదేవ్ మహారాజ్ ఆలయాన్ని స్వామీజీ దర్శించుకున్నారు.

అంతకుముందు నాగాలాండ్‌లో గోధ్వజ్ యాత్రకు అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని శంకరాచార్య స్వామీజీ తప్పుబట్టారు. నేను నాగాలాండ్ ప్రజలను, అక్కడి సంస్కృతి, నాగరికులను లేదా కనీసం ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకించలేదు. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు.

ఏ అంశాన్ని ఆధారంగా చేసుకుని నా ప్రవేశాన్ని వ్యతిరేకించారు? ఇది మన రాజ్యాంగ అధికారాన్ని హననం చేయడమే. భారత్‌లో పుట్టిన ప్రతివ్యక్తి దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు. వారి వారి ప్రజలను కలుసుకునేందుకు వెళుతుండగా నిరోధించడం కచ్చితంగా హక్కుల హననమే. ఏ కారణంతో నన్ను నిలిపేశారో నాగాలాండ్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా అని స్వామీజీ పేర్కొన్నారు.