ప్రతిష్ఠించిన జ్మోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి
చండీగఢ్, అక్టోబర్ 19: గోధ్వజ్ స్థాపన భారత్ యాత్రలో భాగంగా హర్యానా, పం జాబ్ ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాం తం చండీగఢ్‌లో జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి శని వారం పర్యటించారు. నగరంలోని రామేశ్వరి భక్తి ఆశ్రమ ట్రస్ట్ నిర్వహించే శ్రీగోపాల గోలోక్ ధామ్‌లో గోప్రతిష్ఠ ధ్వజాన్ని స్థాపించారు.
అంతకుముందు చండీగఢ్ ఏయిర్ పోర్టుకు చేరుకున్న శంకరాచార్య స్వామీజీ భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. గోమాత ప్రాముఖ్యాన్ని వివరించారు. అనంతరం గోమతి విద్యాగీత్ గోశాలను సంద ర్శించి గోమాతను దర్శించుకున్నారు.
ఈ యాత్రలో భాగంగా 29వ రోజు పంజాబ్‌లో గోప్రతిష్ఠ ధ్వజాన్ని స్థాపించనున్నారు. గోమాతను రాజ్యమాతగా ప్రకటించాలనే డిమాండ్‌తో స్వామీజీ ఈ యాత్రను చేపట్టారు. అయోధ్య నుంచి సెప్టెంబర్ 22న ప్రారంభమైన యాత్ర అక్టోబర్ 26న ఢిల్లీలో ముగుస్తుంది. ఆ రోజు గోవును రాజ్యమాతగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని అవిముక్తేశ్వరానంద స్వామీజీ ఇప్పటికే ప్రకటించారు.