calender_icon.png 6 April, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సముందర్ తాండాలో చలివేంద్రం ఏర్పాటు

05-04-2025 10:39:58 PM

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని సమందర్ తండాలో శనివారం కాంగ్రెస్ మహిళా మండల అధ్యక్షురాలు ఇందిరాబాయి ఆధ్వర్యంలో సముందర్ తాండ బస్టాండ్ స్కూల్ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరాబాయి మాట్లాడుతూ... దారిన పోయే బాటసారులకు ప్రయాణికులకు స్కూల్ పిల్లలకు అందరికీ దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషిచేసిన సంఘసంస్కర్త అని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళ మండల అధ్యక్షురాలు ఇందిరాబాయి, మాజీ సర్పంచ్ బాబు సింగ్, కార్యదర్శి సాయిలు, తులసి రామ్, గని రామ్, హరిదాస్, గ్రామస్తులు తండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.