07-04-2025 07:58:57 PM
రాజంపేట (విజయక్రాంతి): రాజంపేట మండలంలోని గ్రామపంచాయతీ యందు తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నేడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కామారెడ్డి సహకారంతో రాజంపేటలో కమ్యూనిటీ మీడియేషన్ వాలెంటర్స్ ఆఫీసు గ్రామ పంచాయతీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఎండిఓ రఘురామ్ రాజంపేట ఎస్సై పుష్పరాజ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... చిన్న చిన్న వివాదాలకు పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కకుండా ఇక్కడే పరిష్కారం చేసుకోవచ్చన్నారు. ఈ యొక్క మీడియేషన్ ప్రారంభోత్సవం కావడం రాజంపేటలో కావడం హర్షణీయం అని, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, కామారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నవారు విలేజ్ సెక్రటరీ శంకర్ కమ్యూనిటీ మీడియేషన్ వాలెంటర్స్ వి. సిద్ది రాములు, ధరావత్ శంకర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, జిల్లా న్యాయ సేవా సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.