25-03-2025 01:00:29 AM
కల్లూరు, మార్చి 24 :- కల్లూరు పాత బ స్టాండ్ ఎదురుగా ప్రమాద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రజలు కోర డం తో ఎస్త్స్ర డి. హరిత స్పందించి ఏర్పాటు చేయడం పట్ల కల్లూరు ప్రజలు హర్షం వ్యక్తం చేసి, ఎస్ ఐ కి ధన్యవాదాలు తెలిపారు. ప్రమాద హెచ్చరిక లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుండడం తో స్థానికులు విషయాన్ని ఎస్ ఐ దృష్టికి తీసికెళ్లడం తో స్పందించి, హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది.