calender_icon.png 17 April, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలివేంద్రం ఏర్పాటు..

08-04-2025 05:35:49 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారి దాహార్తి తీర్చేందుకు మంగళవారం కార్యాలయం ఆవరణలో చలివేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ మోతిలాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ... తాహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కరిమల వాటర్ ప్లాంట్ యజమాని చింతల శ్రీనివాస్ సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దార్ దిలీప్ కుమార్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.