30-03-2025 06:35:12 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోనాపూర్ గ్రామంలో బస్టాండ్ ప్రక్కన చలివేంద్రాన్ని గాండ్ల సాయిలు ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఆదివారం గ్రామపంచాయతీ సెక్రటరీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రస్తుతం ఎండ వేడిమి ఎక్కువ అవుతున్నందున పాదాచారులకు, వాహనదారులకు దప్పిక తీర్చేందుకు తమవంతు బాధ్యతగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమణారావు, తదితరులు పాల్గొన్నారు.