30-03-2025 05:29:18 PM
పాల్వంచ (విజయక్రాంతి): మండుతున్న ఎండల నుంచి బాటసారిలకు దాహార్తి తీర్చాలనే లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో స్వచ్ఛందంగా చలివేంద్రం ఏర్పాటు చేశారు. పాత పాల్వంచలోని వీరభద్ర వాటర్ సర్వీసింగ్ సెంటర్ వద్ద వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన తాగునీటి కోసం చాలామంది ఇబ్బంది పడుతుంటారు. పరిస్థితిని గమనించిన వీరభద్ర వాటర్ సర్వీసింగ్ సెంటర్ యజమాని ప్రజలకు తగినంత సహాయం చేద్దాం అని చలివేంద్రం కార్యక్రమం నిర్వహించారు. పండగ సందర్బంగా మొదటిరోజు రస్నా, మంచినీరుతో ప్రజల దాహార్తి తీర్చడం పట్ల పలువురు అభినందించారు.