11-03-2025 07:46:17 PM
ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్...
కామారెడ్డి (విజయక్రాంతి): శాంతితోనే సమ సమాజ స్థాపన జరుగుతుందని కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజనీతి శాస్త్ర ఆధ్వర్యంలో 'పశ్చిమ ఆసియా ఉక్రెయిన్ సంక్షోభం - ప్రపంచ శాంతిపై ప్రభావం'అనే అంశంపై ఒకరోజు కార్యశాల రెండు సెషన్స్ గా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.విజయ్ కుమార్ మాట్లాడుతూ... జాతీయ విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించే విధంగా కళాశాలలో వర్క్ షాప్ ఏర్పాటు చేయటం, విశిష్ట మేధోసంపన్నులు కలిగిన ముఖ్య వక్తలు హాజరుకావడం అభినందనీయమైన అంశమని, విద్యార్థులు ఇలాంటి వర్క్ షాప్ ద్వారా ప్రేరణ పొంది విశ్లేషణాత్మక ధోరణితో ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని పొందాలని, యుద్దాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, శాంతి ద్వారానే సమసమాజ స్థాపన జరుగుతుందని తెలిపారు.
రాజనీతి శాస్త్ర విభాగధిపతి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.కిష్టయ్య మాట్లాడుతూ... ప్రస్తుత తరుణంలో ప్రపంచ స్థాయిలో చర్చినాంశం అయిన అంశంపై కార్యశాల నిర్వహించటం గొప్ప విషయమని, ప్రతి వ్యక్తి గ్లోబల్ తో అనుసంధానమై ఉన్నాడని కామారెడ్డికి, ప్రపంచంలో ఎక్కడో నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వారితో అనుసంధానం కలదు అని అన్నారు. ముఖ్య అతిథి, రిసోర్స్ పర్సన్ డాక్టర్ మహమ్మద్ గౌస్ మొదటి సెషన్ లో పశ్చిమ ఆసియా, దేశాల జాబితా, ప్రజలు, సంస్కృతులు, భాషలు గురించి వివరిస్తూ ఇజ్రాయిల్- పాలస్తీనియా ప్రజల మధ్య వివాదం ప్రపంచంలోనే అత్యంత దీర్ఘకాలంగా కొనసాగుతున్న అత్యంత హింసాత్మక వివాదాల్లో ఒకటని, ఈ యుద్ధ మూలాలు ఒక శతాబ్దానికి పైగా ఉన్నాయని తెలిపారు.
ద్వితీయ అంకంలో ముఖ్యఅతిథి, రిసోర్స్ పర్సన్ రాజనీతిశాస్త్ర విశ్లేషకులు ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ... రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రపంచ శాంతికి విగాతమైనది అని, ఈ యుద్ధం కొనసాగింపులో అగ్రరాజ్యాల ఆయుధాల వ్యాపారం, ఖనిజాల దోపిడీ తదితర అంశాలు ఉన్నాయని, అభివృద్ధికి విఘాతంగా ఉన్న ఈ సమస్య సత్వరమే పరిష్కారం కావాలి అని, ఉక్రెన్ నాటో కూటమిలో చేరిక, యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం సమస్య జటిలం కావటానికి మూల కారణాలు అని వెంటనే యుద్ధాలకు ముగింపు పలకాలని కోరినారు.
ఈ కార్యక్రమంలో అకాడమిక్, ఐక్యు ఏసి, యుజిసి, ఎన్సిసి సమన్వయకర్తలు డాక్టర్ పి. విశ్వప్రసాద్, అంకం జయప్రకాష్, డాక్టర్ గణేష్, డాక్టర్ సుధాకర్, పరిపాలన శాస్త్ర విభాగాధిపతి ఎన్.రాములు, డాక్టర్ దినకర్, హిందీ ఆచార్యులు డాక్టర్ జి శ్రీనివాసరావు, అర్థశాస్త్ర, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ రాజ్ గంభీరావు, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, గౌతమి, అధ్యాపకులు ఫర్హీన్ ఫాతిమా, మానస, అనిల్ తదితరులు పాల్గొన్నారు.