కేంద్ర విద్యాశాఖ మంత్రికి బండి సంజయ్ వినతి
కరీంనగర్, జనవరి 7 (విజయక్రాంతి): మాజీ ప్రధాని స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరతో పాటు సిరిసిల్ల జిల్లాలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశా ఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి విన్నవించారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని ప్రతి మండలంలో రెండు పాఠశాలలను పీఎం శ్రీ స్కీం కింద స్థాపించాలని, కరీంనగర్‌లో టెక్నికల్ యూనివర్సిటీ స్థాపించాలని కోరారు.