calender_icon.png 24 February, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కేంద్రంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయండి

24-02-2025 12:00:00 AM

కొత్తగూడెం ఎమ్మెల్యేను సన్మానించిన అథ్లెటిక్స్ మెంబర్ సారంగపాణి

కొత్తగూడెం, ఫిబ్రవరి 23: (విజయక్రాంతి) : భారత అథ్లెటిక్స్ సంఘం ఈసీ మెంబెర్, తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ కె.సారంగపాణి కొత్తగూడెం శాసనసభ్యులు  కూనంనేని సాంబశివరావుని ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్బంగా కె.సారంగపాణి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి చాలా మంది క్రీడాకారులు అథ్లెటిక్స్ విభాగంలో జాతీయ,అంతర్జాతీయ పోటీలలో పతకాలు సాధించడం జరుగుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు సింతేటిక్ ట్రాక్ తో కూడిన, డిస్ట్రిక్ట్ గ్రౌండ్ ఏర్పాటుకై ఎమ్మెల్యే ను కోరడం జరిగిందన్నారు..

అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి జిల్లా లో వున్నా క్రీడాకారులకు ఎల్లప్పుడు తోడుగా వుంటూ తమ సహాయ సహకారాలు అందిస్తాని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహీధర్, జాయింట్ సెక్రటరీ డి.మల్లికార్జున్, న్యూ స్టార్స్ అథ్లెటిక్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎండీ . బాబ్జి, సెక్రటరీ అమిత్ కుమార్, అంతర్జాతీయ అథ్లెటిక్స్ క్రీడాకారుడు మ్ . నరేష్, కోచ్ లు నాగరాజు, వేణు, హనుమంతు, క్రీడాకారులు పాల్గొన్నారు.