calender_icon.png 26 December, 2024 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందానికి ఎసెన్షియల్ ఆయిల్స్!

30-11-2024 12:00:00 AM

అందానికి వివిధ రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ వాడటం సర్వసాధారణం. ఈ క్రమంలో పసుపు వేళ్ల నుంచి తీసిన నూనెలో ఎన్నో సౌందర్యాన్ని రెట్టింపు చేసే ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటున్నారు నిపుణులు..    

ఈ ఎసెన్షియల్ ఆయిల్ వల్ల చర్మానికే కాదు.. కురులకు కూడా చక్కని ప్రయోజనాలు చేకూరతాయి. చుండ్రుని నివారించడంతో పాటు జుట్టు రాలడాన్ని అరికడుతుంది. దీంట్లో యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల కుదుళ్లలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. దీనికోసం ఈ నూనెను నేరుగా కాకుండా మనం ఉపయోగించే సాధారణ నూనె (కొబ్బరి నూనె, బాదంనూనె)లో కొన్ని చుక్కలు కలుపుకొని ఉపయోగించాలి. 

చర్మానికి..

* శరీరంలో సీబమ్ ఉత్పత్తి పెరగడం వల్ల చర్మంపై ఎక్కువ నూనె ఉత్పత్తు జిడ్డుగా మారుతుంది. దాని ద్వారా ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. సీబమ్ ఉత్పత్తిని క్రమబద్దీకరించి.. జిడ్డుతనాన్ని తొలగించడంలో పసుపు నూనె కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నూనెతో మొటిమలు తగ్గుతాయి. 

*  ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. చర్మానికి తేమనందించి పొడి చర్మ సమస్యను దూరం చేస్తాయి. 

*  ముఖంపై ముడతలు, గీతలు రాకుండా చేసి.. చర్మాన్ని యవ్వనంగా ఉంచేలా ఈ నూనె తోడ్పడుతుంది. 

కురులకు..

*  ఈ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి వాపు నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఈ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు. 

*  పాదాల్లో పగుళ్లను తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపకరిస్తుంది. దీనికోసం కొబ్బరినూనె లేదా ఆముదంలో రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమంలతో రోజూ పాదాలకు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే పగుళ్లు తగ్గడంతో పాటు పాదాలు మృదువుగా మారతాయి. 

*  కొన్ని రకాల మచ్చలను నివారించే సౌందర్య ఉత్పత్తుల్లో కూడా దీనిని వినియోగిస్తారు. 

* ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి.