04-04-2025 12:00:00 AM
ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే కీలక పోషక పదార్థాలలో విటమిన్ ఒకటి. ఇది రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడం తోపాటు శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కొల్లాజెన్ అనేది చర్మం, కండరాలు, ఎముకలు, లిగమెంట్లు, రక్తనాళాలు బలంగా ఉండటానికి తోడ్పడే ముఖ్యమైన ప్రొటీన్. విటమిన్ చర్మానికి తేజస్సును అందించడంతోపాటు గాయాలు మానే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేసే విటమిన్ ఒత్తిడికి సంబంధించిన కణాలను సంరక్షిస్తూ శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ కీలకమైన పోషక పదార్థం ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ, తగిన పరిమాణంలో తీసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసుకోవడానికి ఏటా ఏప్రిల్ 4న జాతీయ విటమిన్ దినోత్సవాన్ని జరుపుకొంటాం. శరీరంలో దీన్ని నిలువ చేసుకునే అవకాశం లేదు. అందువల్ల తాజాపండ్లు, కూరగాయలు వంటి సహజ ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం అవసరం.
విటమిన్ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ రోగకారక జీవులతో శరీరం సమర్థవంతంగా పోరాడేలా చేస్తుంది. ఐరన్ శోషణను మెరుగు పర్చి, ఎనీమియాను నివారించడంతోపాటు గుండె సంబంధ సమస్యల ముప్పును తగ్గిస్తుంది. క్యాన్సర్, న్యూరో డీ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా వృద్ధాప్య సూచనలను తగ్గిస్తుంది. డాక్సీసైక్లిన్ వంటి ఔషధాలతో కలిసి విటమిన్ క్యాన్సర్ కణాల వృద్ధిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. విటమిన్ లోపం స్కర్వీ, అలసట, గాయాల మాన్పులో ఆలస్యం వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
సముద్రయానం చేసే నావికులకు తాజా ఆహారం అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. సాధారణంగా, ‘విటమిన్ ఆహారం ద్వారా తీసుకోవచ్చు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా లేదా పొగతాగే అలవాటు ఉన్న వారికి అదనపు సప్లిమెంట్లు అవసరం ఉండొచ్చు. ‘విటమిన్ పరిమితి మించి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. రోజుకు 2000 మి.గ్రా.కు మించి తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, విరేచనాలు, మూత్రపిండంలో రాళ్లు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఒకవేళ దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలని భావిస్తే వైద్యుల సూచనలను పాటించాలి. క్యాన్సర్ చికిత్సలో దీని పాత్రపైనా పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే విటమిన్ సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.
- డాక్టర్ కృష్ణకుమార్ వేపకొమ్మ