calender_icon.png 1 April, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వమతాల సారం ప్రజా హితమే

27-03-2025 01:28:08 AM

కాంగ్రెస్ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి

 మహబూబాబాద్ .మార్చి 26: (విజయక్రాంతి):సర్వ మతాల సారం ఒక్కటే అని,అంతా కలిసి మెలసి సుఖ సంతోషాలతో ఉండాలని జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి అన్నారు.బుధవారం ఆయన మరిపెడ మున్సిపాలిటీ 9వ వార్డు మాజీ కౌన్సిలర్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిదో వార్డులోని ఫాతిమా మసీదులో రంజాన్ నెల ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా యువ నాయకులు నూకల అభినవరెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు వేసవిలో కఠోరమైన రంజాన్ ఉపవాస దీక్షలు ఉంటూ భక్తి శ్రద్ధలతో అల్లాహ్ ను ప్రార్థిస్తుంటారన్నారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాల సమ్మేళనమని,అన్ని వర్గాల ప్రజలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు.

కుల మతాలకు అతీతంగా అంతా కలిసి పండుగలు జరుపుకోవాలని తెలిపారు. పట్టణ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దబోయిన  ఐలమల్లు, మైనార్టీ నాయకులు షేక్ ఖలీల్ పాషా, షేక్ ఖాదర్ బాషా, షేక్ అఫ్జల్, మహ్మద్ అఫ్సర్, అజీజ్, సర్వర్, యాకుబ్ పాషా, కాంగ్రెస్ నాయకులు కొండం దశరథ, పానుగోతు రాంలాల్, గంధసిరి అంబరీష, గుండగాని వెంకన్న, అలువాల ఉపేందర్, భిక్షపతి, నల్లు శ్రీకాంత్ రెడ్డి, గుండగాని సుందర్, కుడితి నరసింహారెడ్డి, లింగయ్య, వార్డు నాయకులు కారంపూడి ఉపేందర్, వెంకన్న, జాని,సోమన్న,షేక్ జాని,యల్లయ్య,షబ్బీర్, లింగయ్య,కొమ్ము భరత్, లక్ష్మణ్ పాల్గొన్నారు