calender_icon.png 27 December, 2024 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ టీచర్ల రాసలీలలు

28-10-2024 01:24:57 AM

  1. ఇంట్లోనే భర్త కంటపడిన వైనం
  2. తలుపు గడియపెట్టి స్థానికులతో కలిసి దేహశుద్ధి

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): విద్యార్థులకు పాఠాలు బోధించా ల్సిన ఉపాధ్యాయులే దారి తప్పారు. భర్త ఇంట్లో లేని సమయంలో ఓ ఉపాధ్యాయిని మరో టీచర్‌తో ఏకాంతంగా గడుపుతూ భర్త కంటపడింది. భర్త స్థానికులతో కలిసి ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకోగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలిసిన వివరాల ప్రకారం.. పెద్దకొత్తపల్లి మండలంలోని ఓ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉపాధ్యాయిని ఇదే పాఠశాలలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడితో అక్రమ సం బంధం నెరపుతున్నది.

వీరిద్దరూ గతంలోనే గ్రామంలో రాసలీలల్లో మునిగితేలగా స్థానికులు వారికి దేహశుద్ధి చేశారు. అయినప్ప టికీ వారిద్దరూ ప్రవర్తన మార్చుకోలేదు. తా జాగా ఉపాధ్యాయిని తన ఇంట్లోనే ప్రియుడితో రాసలీలలు చేస్తూ భర్తకు పట్టుబడింది. దీంతో భర్త స్థానికులతో కలిసి ఇద్దరికీ దేహశుద్ధి చేశాడు. దీనిపై ఎస్సై గోవర్ధన్‌ను వివరణ కోరగా.. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు.