calender_icon.png 3 February, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బా విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు

30-01-2025 12:00:00 AM

వెల్దుర్తి, జనవరి 29 : వెల్దుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు బుధవారం చేతి రాతపై  తపాలా సంస్థ  ఆధ్వర్యంలో  వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీలో 50 మంది విద్యార్థినులు పాల్గొ న్నారు.

ఈ సందర్భంగా మెదక్ సౌత్ ఇన్స్పెక్టర్ సందీప్ కులకర్ణి మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో 18 సంవత్సరాలలోపు విద్యార్థులకు ఈ పోటీ లు నిర్వహిస్తామని, జాతీయస్థాయిలో మొదటి నలుగురికి రూ.50వేలు, రెండో స్థానం రూ.25వేలు, మూడో స్థానం వారికి రూ.10వేలు, హైదరాబాద్ పోస్టల్ సర్కిల్‌లో మొదటిస్థానం లో వారికి రూ.25 వేలు, రెండోస్థానం రూ.10 వేలు, ముడో స్థానం రూ.5వేల నగదును అందజేస్తామన్నారు. పోస్ట్ మాస్ట ర్ మజర్, మేల్ ఓవర్సీల్ క్రిష్ణ, కస్తూర్బా ఎస్‌ఓ ఫాతిమా, టీచర్లు పాల్గొన్నారు.