ఏసీబీకి పట్టుబడిన ఎస్సై అరుణ్‌కుమార్, రైటర్ రామస్వామి
- స్టేషన్ బెయిల్ కోసం రూ.10వేలు డిమాండ్
- రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
- కామారెడ్డి జిల్లాలో లింగంపేటలో ఘటన
కామారెడ్డి, నవంబర్ 14 (విజయక్రాంతి) : స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకుంటూ ఎస్సై, రైటర్ పట్టుబడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. లింగంపేట మండలానికి చెందిన శివలింగగౌడ్ ఇదివరకు జరిగిన గొడవలో ఒకరిని గాయపరిచాడు. అందుకు సంబంధించి కేసు నమోదు కాగా స్టేషన్ బెయిల్ కోసం అతడు ఎస్సై అరుణ్‌కుమార్‌ను కలిశాడు.
అయితే రూ. పదివేలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేయడంతో విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పాడు. పథకం ప్రకారం శివలింగగౌడ్ నగదును గురువారం రైటర్ రామస్వామికి అందిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై, రైటర్‌ను అదుపులోకి తీసుకున్నామని, వారిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లాలో వారం రోజుల్లోనే ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి పట్టుబడటం కలకలం రేపుతున్నది.