calender_icon.png 16 January, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా పాలనపై వ్యాసరచన పోటీలు

01-12-2024 07:46:35 PM

నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలనపై ఆదివారం పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ వ్యాసరచన పోటీలను నిర్మించగా ఈ పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, పరీక్షల కోఆర్డినేటర్ పద్మ, ఎంఈఓ లు పర్యవేక్షించారు. గెలుపొందిన విద్యార్థులకు జిల్లా అధికారుల సమక్షంలో సన్మానం చేసి ప్రశంస పత్రాలను అందించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.