calender_icon.png 13 February, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ మేయిన్స్‌లో ఎస్సార్ హవా

13-02-2025 01:51:45 AM

తిమ్మాపూర్, ఫిబ్రవరి 12: ప్రతిష్టాత్మక జేఈఈ మెయిన్ 25 ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారని;ఎస్సార్ విద్యాసంస్థల జోనల్ ఇంచార్జ్ నేదురి తిరుపతి తెలిపారు. కరీంనగర్ జిల్లా అలుగునూర్ లోని ఎస్సార్ జూనియర్ కళాశాలలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విద్యా సంస్థకు చెందిన దాదాపు 150 మంది విద్యార్థులు తమ సత్తా చూపి జాతీయస్థాయిలో విజయ పతాకాన్ని ఎగరవేశారని ఆనందం వ్యక్తం చేశారు.  మెన్స్ లో కొల్లూరి హసిని 99.3%, బుర్ర మాధవ్ 99.14%, గోవిందారపు శివ సాయి 98.53%, ముదిగంటి రుశిశ్వర్ రెడ్డి 98. 10% దయ్యాల రాజ్ కుమార్ 97.61%, పోగులు ఆశ్రిత్ 96.26%, జవాజ సహస్ర 94.35%, దొనకొండ సాయి చెందిన 92.18% మేకల సంజన 91.61%; చరణ్ జోషి 91.12% కటకం శ్రీలేఖ 90% సాదించారు.

అకాడమిక్ డీన్స్ అశోక్ రెడ్డి, రవీందర్ రెడ్డి,; ప్రిన్సిపాళ్ళు నాగార్జున రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మారుతి, సరోత్తమ్ రెడ్డి, సిహె ప్రవీణ్ రెడ్డి, ఏవో లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు.