ఫిబ్రవరి 25న రెండింటికీ నోటిఫికేషన్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): టీజీ ఈసెట్, టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్ షెడ్యూల్ ఖరారైంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు పురుషోత్తం, ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశం, ఆయా సెట్ల కన్వీనర్లు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 25న టీజీ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 12న ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 25న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.
మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. లేట్ ఫీజుతో మే 25 వరకు అవకాశమిచ్చారు. ప్రవేశ పరీక్షను జూన్ 6న నిర్వహించనున్నారు. మూడేళ్ల కో ర్సు వారికి ఉదయం, మధ్యాహ్నం సెష న్స్, ఐదేళ్ల కోర్సు వారికి సాయంత్రం సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
సెట్ దరఖాస్తు తేదీ పరీక్ష తేదీ
టీజీ ఈసెట్ మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు మే 12
టీజీ లాసెట్ మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు జూన్ 6