నిర్మల్ నవంబర్ 04(విజయక్రాంతి): తనకు న్యాయం చేయాలని కోరుతూ నిర్మల్ పట్టణంలోని బుధవార్‌పేట్ గాంధీనగర్‌కు చెందిన చందులు సాయికిరణ్ ఆర్డీవో ఆఫీస్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు తన కుటుంబసభ్యులతో కలిసి పొర్లు దండాలు పెట్టి నిర సన తెలిపారు. తల్లిదండ్రుల ఉమ్మడి ఆస్తిని తన కుటుంబ సభ్యులు సమానంగా పంచకుండా వేదించడంతో సాయికిరణ్, అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట 28 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు.
సమస్యను అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఆస్తినిఅడిగితే కుటుంబసభ్యులు దాడి చేస్తున్నారని, తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని దీక్ష చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సమస్యను కలెక్టర్‌కు విన్నవించేందుకు 5 కి.మీ. పొర్లు దండాలు పెట్టినట్టు బాధితుడు తెలిపాడు. తన తల్లిదండ్రులు, అన్నదమ్ములపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్ అధికారులకు సాయికిరణ్ వినతిపత్రం అందించారు. కాగా బాధితుడికి పలు సంఘాల నేతలు మద్దతు పలికారు.