హైదరాబాద్: పోలీసులు విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారనే ఆరోపణలపై బీఆర్ఎస్(BRS)నేత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్(Errolla Srinivas)ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసం నుంచి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గతంలో ఇదే కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. శ్రీనివాస్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఉదయం 5 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నారని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. పోలీసులు నోటీసులు,వారెంట్‌లు జారీ చేయలేదని, చట్టం ప్రకారం ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికే ఎర్రోళ్ల శ్రీనివాస్ ను 3 సార్లు పోలీసులు విచారణకు పిలిచారు. శ్రీనివాస్ విచారణకు రానందునే అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు.