17-04-2025 12:00:00 AM
పాలకుర్తి ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): ఈ నెల 21న పాలకుర్తిలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నియోజకవర్గంలోని యువతి, యువకులకు ఉద్యోగాల కల్పనకు ఈ నెల 21న (సోమవారం) రోజున ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తామని, ఈ జాబ్ మేళాకు 100 కీ పైగా కంపెనీలు రానుండగా 5 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు, కనీస వేతనం రూ.15000 వేలు ఉంటుందన్నారు.
పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఫార్మసీ, డిప్లమో అర్హత గల 18 సంవత్సరాలు పైబడిన యువతి, యువకులు అర్హులు. మరిన్ని వివరాలకు 8978790201 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవాలని. బిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.