08-04-2025 12:00:00 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 7, (విజయ క్రాంతి): దివ్యాంగ విద్యార్థులకు సర్వ శిక్ష, అలిన్కో సంయుక్త ఆధ్వర్యంలో సమకూర్చిన ఉపకరణాలను కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యంగా విద్యార్థుల భవిష్యత్తులో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు.
ప్రభుత్వం సమకూర్చిన సౌకర్యాలను వినియోగించుకొని చక్కగా చదువుకోవాలని, తల్లిదండ్రులు వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కాలేరు యాదగిరి, ఐ ఈ ఆర్ పీ వెంకటరమణ, ఉపేందర్, కపిల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, ట్రాన్స్పోర్ట్ కమిటీ మెంబర్ రావుల మురళి తదితరులు పాల్గొన్నారు