calender_icon.png 29 April, 2025 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

29-04-2025 12:14:29 AM

  1. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల డిమాండ్

10వ రోజుకు చేరిన సమ్మె

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని వివిధ యూనివర్సిటీల్లో వారు చేస్తున్న సమ్మె సోమవారం 10వ రోజుకు చేరింది. ఓయూ పరిపాలన భవనం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మెకు వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సంఘీభావాన్ని ప్రక టించారు. వారి న్యాయమైన డిమాండ్లను సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని హమీ ఇచ్చారు. కాం ట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వం తక్షణమే స్పందించి వారితో చర్చలు జరపాలని సూచించారు.

వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ నాయకులు డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ పరుశురాం, డాక్టర్ కుమార్, డాక్టర్ ఉపేందర్ తదితరులు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకి ష్టారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. యూజీసీ పేస్కేల్ తమకు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వంతో న్యాయం జరిగే లా చూస్తామని బాలకిష్టారెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు.

కాగా కాకతీయ యూనివర్సిటీలో జరిగిన సమ్మెలో సంఘం నాయకు లు డాక్టర్ కనకయ్య, డాక్టర్ కర్ణాకర్, డాక్టర్ భాస్కర్, డాక్టర్ శ్రీధర్‌లోథ్, డాక్టర్ నిరంజన్ మాట్లాడుతూ.. ఏండ్ల తరబడి యూని వర్సిటీల విద్యాప్రమాణాలను కాపాడుతున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

వివిధ యూనివర్సిటీల్లో జరిగిన నిరసనల్లో డాక్టర్ విజయేం దర్‌రెడ్డి, డాక్టర్ తాళ్లపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ వినీతపాండే, డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ సతీష్, డాక్టర్ సూర్యనారాయణ, డాక్ట ర్ ఫిరోజ్‌పాషా, డాక్టర్ కవిత, డాక్టర్ సునీత, డాక్టర్ భాగ్యత, తదితరులు పాల్గొన్నారు.