సీపీఐ నేతల డిమాండ్
కామారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న డాటా ఎంట్రీలకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ కోరారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఆమె మాట్లాడారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
90 శాతానికి పైబడిన నిరుపేదలకు రేషన్ బియ్యాన్ని అందించడంలో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని పనిభారం తగ్గించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బాలరాజ్, ఉపాధ్యక్షుడు ఎల్ దశరథ్, దుబ్బాస్ రాములు, సివిల్ సప్లు డాటా ఎంట్రీ ఉద్యోగులు పాల్గొన్నారు.