- మార్చి 12న పీజీఈసెట్ నోటిఫికేషన్
- మార్చి 6న ఐసెట్ నోటిఫికేషన్
- సెట్స్ షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి ): సెట్స్ (కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్) షెడ్యూ ల్ ఖరారయ్యింది. సోమవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులు టీజీ ఎప్ సెట్, టీజీ పీజీఈసెట్, టీజీ ఐసెట్ షెడ్యూ ల్‌పై నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20న ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నా రు. వంద శాతం సిలబస్ నుంచి ప్రశ్నలు రా నున్నట్టు తెలిపారు.
పీజీఈసెట్‌కు మార్చి 12న నోటిఫికేషన్ ఇవ్వను న్నా రు. మార్చి 6న ఐసెట్ విడుదల చేయనున్నారు. ఉన్న త విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు పురుషోత్తం, మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, సెట్స్ కన్వీనర్లు పాల్గొన్నారు.