- మొదటి వారంలో పాలిసెట్
- త్వరలో షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాం తి): ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సెట్స్) షెడ్యూళ్లను విడుదల చేసేందుకు ఉన్నత విద్యమండలి సన్నాహాలు చేస్తోంది. 2025-26 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు టీజీ ఎప్‌సెట్ పరీక్షలను మే రెండోవారంలో నిర్వహించే అవకాశముంది.
ఇంజినీరింగ్‌కు మూడ్రోజులు, ఫార్మసీ, అగ్రికల్చర్‌కు రెండ్రో జులపాటు పరీక్షలు నిర్వహిస్తారు. మే మొదటి వారంలో పాలిసెట్‌ను నిర్వహించనున్నారు. మంగళవారం మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సెట్స్ కన్వీనర్ల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సెట్స్ షెడ్యూల్, పరీక్షలు, ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. త్వరలోనే ఎప్‌సెట్‌తోపాటు మిగిలిన ఐసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్, ఈసెట్ షెడ్యూళ్లను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించే వర్సిటీలు, కన్వీనర్ల ఎంపిక పూర్తయిన విషయం తెలిసిందే.