calender_icon.png 16 January, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏప్రిల్ 29 నుంచి ఎప్‌సెట్

16-01-2025 03:03:11 AM

  1. జూన్ 19 వరకు ప్రవేశ పరీక్షలు
  2. సెట్స్ షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ఉన్నత విద్యామండలి

హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్స్)ల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి బుధవారం షెడ్యూల్ విడు దల చేసింది. 2025-26 విద్యాసంవత్సరానికిగానూ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు మొత్తం 8 ఎంట్రెన్స్ టెస్టులను నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఎప్(ఈఏపీ)సెట్ ను నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు ఏప్రిల్ 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తే, ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం మే 2 నుంచి 5 వరకు నిర్వహిస్తారు. ఎప్‌సెట్ పరీక్షలను జేఎన్టీయూహెచ్ వర్సిటీ నిర్వ హించనుంది. డిప్లొమా విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్ మే 12న నిర్వహించనున్నారు.

ఈసెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుండగా, ఎడ్‌సెట్‌ను కాకతీయ యూనివర్సిటీ, లాసెట్, పీజీఎల్‌సెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ  ఐసెట్‌ను ఎంజీయూ, పీజీఈసెట్-జేఎన్టీయూ హెచ్, పీఈసెట్-పాలమూరు యూనివర్సిటీ నిర్వహించనుంది.