16-03-2025 12:28:46 AM
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): టీజీఎప్‌సెట్‌కు వచ్చిన దరఖాస్తులు లక్ష దాటాయి. శనివారం వరకు ఇంజినీరింగ్ విభాగానికి 85,702, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగానికి 34,541 దరఖాస్తులు వచ్చాయి. ఇక రెండింటికి కలిపి 90 దరఖాస్తులు అందాయి. మొత్తంగా 1,20,333 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.