న్యూఢిల్లీ, జూలై 11: వేతన జీవులకు ఈపీఎఫ్‌వో తీపి కబురు చెప్పింది. రిటైర్ అయ్యే ఉద్యోగులకు, ఫైనల్ పీఎఫ్ సెటిల్‌మెంట్ చేస్తున్న ఉద్యోగులకు కొత్త వడ్డీ రేట్లతో చెల్లిస్తున్నట్లు తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరానికి 8.25 వడ్డీని మే 31న ఖరారు చేశారు. 2024 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఫైనల్ సెటిల్‌మెంట్ చేసుకున్న వారికి కొత్త వడ్డీ రేట్లతో చెల్లిస్తున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది.