ఈఎల్‌ఐ కింద బ్యాంకు, ఆధార్ అనుసంధానానికి గడువు పొడగింపు
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఖాతాదారులకు ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్(యూఏఎన్) యాక్టివేషన్ చేసుకోవడానికి, ఎంప్లాయిమెంట్ లింక్‌డ్ ఇన్సెంటివ్ (ఈఎల్‌ఐ) స్కీమ్ కింద బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్‌లను లింక్ చేసేందుకు గడువును మరోసారి పెంచింది. యూఏఎన్ యాక్టివేషన్, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను లింక్ చేయడానికి జనవరి 15, 2025 వరకు గడవును పొడిగిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఇందు కోసం ఈపీఎఫ్‌ఓ డిసెంబర్ 15ను తుది గడువుగా ప్రకటించింది. అయి తే ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మరోసారి గడువును పొడగించినట్టు స్పష్టం చేసింది.