01-03-2025 12:58:37 AM
ఈసారీ 8.25 శాతమే
న్యూఢిల్లీ : 2024- ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేటును ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీ ఎఫ్‌ఓ) నిర్దారించింది. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నా రు. 2024- ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీరేటు యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఆర్థిక మం త్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వా త..
ఈ వడ్డీ రేటు ఏడు కోట్లకు పైగా చందాదారులకు జమ అవుతుంది. 2022- ఈ వడ్డీ 8.15 శాతంగా ఉండేది. అయితే దీనిని 2023 8.25 శాతానికి పెంచారు. 2018 ఈ రేటు 8.65గా ఉండేది. 2021 ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ రేటు ఏకంగా 8.1 శాతానికి పడిపోయింది. ఇప్పుడు గత ఏడాది మాదిరి గానే 8.25 శాతం వద్దనే కొనసాగుతుందని ప్రకటించారు.