calender_icon.png 26 December, 2024 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనాలకు కుచ్చుటోపీ పెట్టిన రెండు రియల్ ఎస్టేట్ సంస్థలు

01-11-2024 08:49:53 PM

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): నగరంలో సొంత ఇళ్లు కట్టుకోవాలనేది ప్రతీ ఒక్కరి కల. దానిని ఆసరాగా చేసుకుని జనాలకు కుచ్చుటోపీ పెడుతున్నాయి. కొన్ని రియలేస్టేట్ సంస్థలు. ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ సినీ తారలతో ప్రచారం చేయిస్తున్నారు. వారు కూడా డబ్బులకు ఆశపడి అసలు విషయం తెలియక ప్రచారం చేస్తున్నారు. తమ అభిమాన తారలే అంత నమ్మకంగా ప్రచారం చేస్తుండడంతో జనాలు గుడ్డిగా నమ్మేసి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి మోస పోతున్నారు.

తీరా ఇలాంటి మోసమే తాజాగా వెలుగులోకి వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రచారకర్తగా ఉన్న సాయి సూర్య  డెవలపర్స్ సంస్థ జనాలను నిండా ముంచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాయిసూర్య డెవలపర్స్ ఎండీ కంచర్ల సతీష్ చంద్రగుప్తా, భాగ్యనగర్ ప్రాపర్టీస్ డైరెక్టర్ నరేందర్ సురానాలు వట్టి నాగులపల్లిలోని ఒకే ల్యాండ్ లో సాయి తులసి ఎంక్లేవ్ 4, షణ్ముఖ నివాస్ పేర్లతో సరైన అనుమతులు లేకుండానే రెండు లేఔట్లు వేశారు. సాయిసూర్య డెవలపర్స్ ప్రచారకర్తగా సినీహీరో మహేష్ బాబు వ్యవహరించారు.

పై రెండు రియలేస్టేట్ సంస్థలు ఎవరికి వారుగా అమ్మకాలు సాగించి వినియోగదారుల వద్ద నుండి భారీ ఎత్తున డబ్బులు వసూళ్లు చేశారు.అయితే సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు ఒకటే సర్వే నెంబర్లలోని భూమిలో రెండు వేరు వేరు పేర్లతో వెంచర్లు వేసి మోసం చేస్తున్నట్లు గుర్తించిన గోపాల్ రెడ్డి అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఈఓడబ్ల్యూ పోలీసులు సాయిసూర్య డెవలపర్స్ ఎండీ కంచర్ల సతీష్ చంద్రగుప్తా, భాగ్యనగర్ ప్రాపర్టీస్ డైరెక్టర్ నరేందర్ సురానాలను అదుపులోకి తీసుకున్నారు.