calender_icon.png 13 February, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికెన్ షాపుల్లో కోళ్లను పరిశీలించిన ఈఓ

13-02-2025 12:00:00 AM

కల్లూరు, ఫిబ్రవరి 12 ః ఎంపీడీవో, తహసీల్దార్ ఆదేశాల మేరకు పట్టణంలోని కోళ్ల దుకాణాలను కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీ ఈవో నంది శెట్టి నాగేశ్వర రావు తన సిబ్బందితో బుధవారం పరిశీలిం చారు. దుకాణాల్లోకి వెళ్లి చనిపోయిన కోళ్లను విక్రయిస్తున్నారా మంచికోళ్లను విక్రయిస్తున్నారా అని దుకాణాల యజ మానులను అడిగి తెలుసుకున్నారు. మండ లంలోని చుట్టుపక్కల గ్రామాలలో బర్డ్‌ఫ్లూ వ్యాధి కోళ్లకు ఉన్నందున అట్టి కోళ్లను దిగుమతి చేసుకో వద్దని, కోళ్లలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే అట్టి కోళ్ల ను విక్రయిం చవద్దని యజమానులకు తెలిపారు.